షాపింగ్‌ మాల్‌లో డ్యాన్స్‌ చేసిన కుర్రాడు.. ఫిదా అవుతోన్న నెటిజన్లు
Advertisement
ఇటీవలే భారత్‌లో సంజీవ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఓ వేడుకలో అదిరిపోయేలా స్టెప్పులు వేసి 'డ్యాన్సింగ్ అంకుల్'గా పాప్యులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే. తాజాగా, పాకిస్థాన్‌లో ఓ కుర్రాడు చేసిన డ్యాన్స్‌ వైరల్‌ అవుతోంది. కరాచీలోని హైపర్‌స్టార్‌ మాల్‌లో ఆ కుర్రాడు వేసిన డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మెహ్రోజ్‌ బైగ్‌ అనే విద్యార్థి.. పంజాబీ సూపర్‌ హిట్‌ ‌‘లాంగ్‌ లాచీ’ పాటకు డ్యాన్స్‌ వేశాడు. ఆయన వేసిన స్టెప్పులు వీక్షకుల్లో హుషారు తెప్పించేలా ఉన్నాయి. అక్కడ ఉన్న ఓ వృద్ధుడు కూడా ఆ కుర్రాడి డ్యాన్స్‌ని చూసి హుషారైపోయి స్టెప్పులేశాడు. గతంలోనూ ఆ కుర్రాడు ఇలా పలుచోట్ల డ్యాన్సులు చేసి అలరించాడు. 
Fri, Jul 13, 2018, 05:14 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View