వారాంతంలో ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిన్న ఆల్ టైమ్ రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్... ఈ ఉదయం కూడా దాదాపు 100 పాయింట్ల లాభంతో పాజిటివ్ గానే ప్రారంభమైంది. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... చివరకు నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 36,542కి పడింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 11,019 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ఎంటర్ ప్రైజెస్ (5.96%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (3.97%), ఎంఫాసిస్ (3.92%), డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ (3.53%), టైటాన్ (3.42%).

టాప్ లూజర్స్:
పీవీఆర్ లిమిటెడ్ (-13.10%), ఎన్సీసీ (-8.75%), గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (-7.98%), కర్ణాటక బ్యాంక్ (-7.93%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (-6.63%).  
Fri, Jul 13, 2018, 04:27 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View