వైద్య శాస్త్రం మరో ఘనత... మొట్టమొదటి తొలి కలర్ ఎక్స్ రే ఇదే!
Advertisement
Advertisement
వైద్య శాస్త్రం మరో మెట్టెక్కింది. న్యూజిలాండ్ సైంటిస్టులు తొలిసారిగా కలర్ ఎక్స్ రేను తీసి చూపించారు. అది కూడా త్రీ డైమన్షన్ లో. మానవుడిపై తీసిన తొలి కలర్ ఎక్స్ రే ఇదే. ఇందుకు అవసరమైన ఇమేజింగ్ టెక్నాలజీని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సీఈఆర్ఎన్ - సెర్న్) అందించగా, మెడికల్ డయాగ్నస్టిక్ విభాగంలో కలర్ ఎక్స్ రే మైలురాయని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

2012లో దైవకణంను కనుగొనేందుకు తయారైన హార్డన్ కొలైడర్ కోసం ఈ సాంకేతికతను సెర్న్ తయారు చేసింది. ఈ ఎక్స్ రేలతో వైద్యులు తమ రోగులకు ఉన్న వ్యాధి గురించి మరింత కచ్చితంగా తెలుసుకుంటారని ఓ ప్రకటనలో సెర్న్ తెలిపింది. హై రెజల్యూషన్, హై కాంట్రాస్ట్ తో చిత్రాలు లభిస్తాయని ఈ సాంకేతికత అభివృద్ధికి సహకరించిన యూనివర్శిటీ ఆఫ్ సెంటర్ బురీ ప్రొఫెసర్ ఫిల్ బుట్లర్ తెలిపారు. ఈ ఎక్స్ రేలో ఎముకలు, కండరాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని, కేన్సర్ కారక ట్యూమర్లుంటే వాటి పరిమాణం ఎంత ఉందన్న విషయాన్నీ గుర్తించవచ్చని అన్నారు.
Fri, Jul 13, 2018, 12:33 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View