33 ఏళ్లకే అమ్మమ్మనయ్యాను: రాయ్ లక్ష్మి చమత్కారం
Advertisement
తన అందచందాలు, ఐటమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి రాయ్ లక్ష్మి, తాను 33 ఏళ్ల వయసులోనే అమ్మమ్మనైపోయానని ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించింది. అలా ఎలా? అనుకుంటున్నారా? రాయ్ లక్ష్మి ఇంట్లో రెండు పెంపుడు శునకాలు మియు, లియు ఉండగా, వాటిని తను కన్న తల్లిలా చూసుకుంటుంది.

ఇక ఆ రెండూ కలసి ఇప్పుడు మరో రెండు పప్పీలను కన్నాయట. దీంతో తాను తల్లి అయ్యే వయసులోనే అమ్మమ్మను అయ్యానని ప్రకటించేసుకుంది రాయ్ లక్ష్మి. కొత్త పప్పీలకు టిఫానీ, పనో అని పేర్లు పెట్టుకున్న ఆమె, వాటితో కలసి దిగిన ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం మలయాళంలో 'ఓరు కుట్టనందన్‌ బ్లాగ్‌', తమిళంలో 'నీయ 2'తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. 
Fri, Jul 13, 2018, 10:32 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View