క్షణాల్లో నేలమట్టమైన భారీ వంతెన... వీడియో!
13-07-2018 Fri 08:40
- సాంకేతికంగా నిర్మాణ పనులు
- 200 కిలోల బాంబులతో పేల్చివేత
- కొలంబియాలో ఘనత

నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయన్న కారణంతో కొలంబియాలో ఓ బ్రిడ్జ్ ని అధికారులు కూల్చివేశారు. ఇందుకోసం 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను ఉపయోగించారు. బ్రిడ్జి పునాదుల నుంచి పైవరకూ బాంబులను అమర్చి, వాటిని పేల్చగా, పెద్ద శబ్దం చేస్తూ ఆ వంతెన కుప్పకూలిపోయింది. చుట్టూ తిరిగి వెళ్లాలంటే రెండు గంటల సమయం తీసుకునే రెండు ప్రాంతాల నడుమ ఓ లోయలో దీన్ని నిర్మిస్తున్నారు.
చిరాగరా కానియన్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఓ ప్రమాదంలో పది మంది కార్మికులు మృతి చెందారు. 2017 జనవరిలో జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతూనే ఉండటం గమనార్హం. 446 మీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జ్ డిజైన్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించిన అధికారులు దీన్ని పేల్చి వేయాలని నిర్ణయించారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
