చోరీ చేసే ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన దొంగ.. వీడియో వైరల్‌
Advertisement
ఓ దుకాణంలో చోరీ చేయడానికి అర్ధరాత్రి వచ్చిన కొందరు దొంగల్లో ఒకరు డ్యాన్స్ చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ చోరీలో మొత్తం ముగ్గురు యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ చేసిన దొంగతో పాటు మరో ఇద్దరు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఓ దుకాణంలోకి చొరబడినట్లు కనిపిస్తోంది. వారి ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.   
Thu, Jul 12, 2018, 03:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View