మెస్సీకి బాబులాంటోడిని చూస్తారా?: సెహ్వాగ్ షేర్ చేసుకోగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో!
Advertisement
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండి, తన అభిమానులను అలరిస్తుండే భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసుకున్నాడు. సమకాలీన ఫుట్ బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీ ఎంత ప్రముఖ ఆటగాడో అందరికీ తెలిసిందే. అతను గురిచూసి గోల్ కొడితే, దాన్ని ఏ గోల్ కీపరూ ఆపలేడని అభిమానులు కితాబిస్తుంటారు.

 ఇక, ఓ వ్యక్తి, ఫుట్ బాల్ ను కిందపెట్టి, గురిచూసి తన్నిన వీడియో ఒకటి సెహ్వాగ్ ట్విట్టర్ ఖాతాలో వైరల్ అయింది. వేల కొద్దీ షేర్లను తెచ్చుకుంది. "ఫ్రాన్స్, ఇంగ్లండ్ క్రొయేషియాలను మరచిపోండి... ఈ వ్యక్తిని చూడండి" అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు 'మెస్సీ కా చాచా' అని హ్యాష్ ట్యాగ్ తగిల్చాడు. ఆ వీడియోను మీరూ చూడండి.
Thu, Jul 12, 2018, 09:46 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View