రూ.499 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసిన ఎయిర్‌టెల్!
Advertisement
టెలికాం మార్కెట్లో రిలయన్స్‌ జియో ఇస్తోన్న పోటీతో ఇతర కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. టెలికాం దిగ్గజం  ఎయిర్‌టెల్ పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అలాగే, ఇప్పటికే ఉన్న ఆఫర్లలో పలు మార్పులు చేసి మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. తాజాగా రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అందిస్తున్న డేటా లిమిట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఇప్పటివరకు 40 జీబీ డేటా పొందేవారు... ఇకపై 75 జీబీ డేటా అందుకోవచ్చు. ఇక ఇతర ప్రయోజనాలయిన రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్ కూడా అందుకోవచ్చు. వీటితో పాటు రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.         
Tue, Jul 10, 2018, 09:26 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View