తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట... వైరల్‌ వీడియో
Advertisement
పెళ్లి చేసుకుని పార్కుకి వెళ్లి అక్కడి పచ్చని అందాల మధ్య వీడియో తీసుకుంటోన్న ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. అమెరికాకు చెందిన చెయెన్నె, లుకాస్‌ జంట వైభవంగా పెళ్లి చేసుకుంది.

వెడ్డింగ్ వీడియో షూట్‌లో పాల్గొంటూ ఓ చెట్టు కింద వారిద్దరూ కూర్చున్నారు. మొదట పెళ్లి కొడుకుకి చెట్టుపై నుంచి ఓ శబ్దం వినిపించింది. ఏంటా అని వారిద్దరూ పైకి చూసేసరికి ఓ కొమ్మ విరిగి తమపై పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆ క్షణమే అక్కడి నుంచి లేచి పరుగులు తీశారు. ఈ వీడియో టీజర్‌ను వారే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.                             
Mon, Jul 09, 2018, 08:21 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View