ఆఫీసుకి టీ షర్ట్స్‌ ధరించి వచ్చేవారే మెరుగ్గా పనిచేస్తున్నారట.. పరిశోధనలో వెల్లడి!
Advertisement
సౌకర్యవంతమైన దుస్తులతో ఆఫీసుకి వెళ్లే ఉద్యోగులే మంచి పనితీరు కనబరుస్తారని ఓ అధ్యయనంలో తేలింది. ఆఫీసుకి వేసుకెళ్లే సంప్రదాయబద్ధమైన దుస్తుల కంటే టీ షర్ట్స్‌ ధరించి వెళ్లే వారే బాగా పనిచేస్తున్నారని జర్మన్‌ పరిశోధకులు అంటున్నారు. ఆఫీసు సమయంలో టై ధరించడంతో మెదడుకు రక్త సరఫరా ఇతరులతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉంటుందని తెలిపారు.

తాము 30 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఎంఆర్‌ఐ స్కాన్‌లు తీసి కూడా నిర్ధారించుకున్నామని, మెదడుకు రక్త సరఫరా టైలు ధరించని వారితో పోలిస్తే వారిలో తక్కువగా ఉందని తెలిపారు. ఈ సమస్య ఉంటే ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పారు. టైలు కట్టుకుంటే కళ్లపై కూడా ఒత్తిడి పెరుగుతుందని గతంలోనూ పలువురు పరిశోధకులు చెప్పారు.
Sun, Jul 08, 2018, 07:53 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View