బాలీవుడ్ పాటలకు న్యూయార్క్ వీధుల్లో విదేశీయుడి నృత్యం... ఫిదా అవుతున్న నెటిజన్లు!
Advertisement
గతంలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసి, ఇటీవల ట్యూబర్ అవతారం ఎత్తిన క్యూపార్క్ అనే వ్యక్తి, న్యూయార్క్ వీధుల్లో బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసి, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, నెటిజన్లు దాన్ని చూసి ఫిదా అవుతున్నారు. యూ ట్యూబ్ లో 30 లక్షల మంది ఫాలోవర్లను కలిగివున్న క్యూ పార్క్, ‘చోలీ కే పీఛె క్యా హై’, ‘థూమ్ మచా లె థూమ్’, ‘ఛమ్మక్ ఛల్లో’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ తదితర పాటలకు రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్స్, రెస్టారెంట్ ముందు... ఇలా తనకు నచ్చిన చోటల్లా నృత్యం చేస్తుంటే, ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. పలువురు తమ స్మార్ట్ ఫోన్లకు పని చెప్పారు. గత నెల 29న ఈ వీడియోను పోస్టు చేయగా, ఇప్పటికే ఏడున్నర లక్షల మంది చూసిన క్యూపార్క్ డ్యాన్స్ వీడియోను మీరూ  చూడవచ్చు.
Sun, Jul 08, 2018, 11:19 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View