సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

06-07-2018 Fri 07:30
advertisement


 *  ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత కనుమరుగైన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి విదితమే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా ఓ పెద్ద బ్యానర్ కూడా ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది.
*  లక్ష్మి మంచు ప్రధాన పాత్ర పోషించిన 'వైఫ్ ఆఫ్ రామ్' చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. విజయ్ ఎలకంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి లక్ష్మి సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.
*  ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ ప్రధాన పాత్రధారిగా 'మై డియర్ మార్తాండం' అనే చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు హరీష్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తాజాగా ముగిశాయి. త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement