రష్యా యువజంట కాపురంలో నిప్పులు పోసిన 'మెస్సీ -రొనాల్డో'!
Advertisement
ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమతో 2002 వరల్డ్ కప్ పోటీల సందర్భంగా ఓ బార్ లో కలుసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ రష్యా జంట, పదహారేళ్ల తరువాత అదే ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న వేళ విడాకులకు దరఖాస్తు చేసింది. ఓ రష్యా పత్రిక వెల్లడించిన ఈ ఆసక్తికర కథనం ప్రకారం, వీరు విడిపోవడానికి కారణం వరల్డ్ ఫుట్ బాల్ స్టార్స్ రొనాల్డో, మెస్సీ.

రొనాల్డో వీరాభిమాని అయిన భార్య, మెస్సీకి అభిమాని అయిన భర్తల మధ్య ఎవరు గొప్పన్న విషయంలో విభేదాలు వచ్చాయి. మెస్సీకన్నా రొనాల్డో గ్రేట్ అని భార్య, కాదు మెస్సీనే గ్రేట్ అంటూ భర్త వాదులాడుకున్నారు. పెనాల్టీ లభించినా స్కోర్ చేయని మెస్సీ ఏం ఆటగాడని ఆమె చేసే విమర్శలతో నిగ్రహించుకోలేకపోయిన భర్త, ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఆ మరుసటి రోజే ఓజే చెలియాబిన్స్క్‌ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
Thu, Jul 05, 2018, 09:51 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View