దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాక్.. లాటరీలో రూ.13 కోట్లు!
Advertisement
బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయుడు ఏళ్లపాటు అక్కడ పనిచేశాడు. ఇక తిరిగి స్వదేశానికి వచ్చి స్థిరపడాలని భావించాడు. అయితే, అదృష్ట దేవత వరించడంతో వస్తూ వస్తూ ఏకంగా రూ.13 కోట్లను వెంటబెట్టుకు వచ్చాడు. లాటరీ రూపంలో పెద్ద మొత్తం తగలడంతో అతడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

కేరళకు చెందిన తేజో మాథ్యూ (30) అబుదాబిలో ఓ కంపెనీలో సివిల్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. దుబాయ్‌ను శాశ్వతంగా వదిలిపెట్టి స్వగ్రామానికి వచ్చి స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. గత నెలలోనే భారత్ వచ్చేందుకు దుబాయ్ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ ఓ లాటరీ టికెట్ కొని ఫ్లైటెక్కాడు. తాజాగా అతడు కొన్న లాటరీ టికెట్‌కు రూ.13 కోట్లు తగిలినట్టు ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయాడు.

తన అదృష్టాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాడు. కేరళలో ఇల్లు కొనాలనేది తన కల అని, ఇప్పుడా కలను నిజం చేసుకుంటానని మాథ్యూ ఆనందంగా చెప్పాడు. దుబాయ్ లాటరీలో తేజో సహా తొమ్మిది మంది విజేతలుగా నిలిచారు. వీరిలో ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీ, మరో కువైట్ దేశస్థుడు ఉన్నారు.
Thu, Jul 05, 2018, 05:56 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View