జోరు వాన.. స్విమ్మింగ్‌ పూల్‌ను తలపించిన రోడ్డు.. అక్కడి నుంచే రిపోర్టింగ్‌.. వీడియో వైరల్
Advertisement
జోరు వాన కురిసిందంటే చాలు.. చాలా నగరాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే, ఈ పరిస్థితిని వివరించి చెప్పడానికి ఓ రిపోర్టర్‌ వినూత్న మార్గాన్ని ఎంచుకుని, పూర్తిగా నీళ్లలోకి దిగి రిపోర్టింగ్‌ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ రోడ్డు స్విమ్మింగ్‌ పూల్‌ను తలపిస్తోందని చెబుతూ.. ఈత నేర్చుకోవడానికి ఉపయోగించే ట్యూబ్‌లో కూర్చున్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఉండే వాతావరణాన్ని అక్కడ సృష్టించి రోడ్డు మధ్యలో కూర్చుని అక్కడి పరిస్థితిని చెప్పాడు. నగరమంతా ఇదే పరిస్థితి ఉందని అన్నాడు.
Wed, Jul 04, 2018, 07:01 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View