అభిమానితో ప్రియాంకా చోప్రా సెల్ఫీ దిగుతున్న వేళ... పక్కకెళ్లి నిలుచున్న నిక్ జొనాస్... వైరల్ వీడియో!
Advertisement
Advertisement
బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా, గత కొంత కాలంగా నిక్ జోనాస్ తో డేటింగ్ లో ఉంటూ, పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ జంటగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం త్వరలో జరగనుందన్న వార్తలూ వస్తున్నాయి. ఇటీవల ముఖేష్ అంబానీ ఇంట జరిగిన నిశ్చితార్థానికి వచ్చి తిరిగి న్యూయార్క్ వెళ్లిన ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రియాంకను గుర్తించిన ఓ యవతి, ఆమెతో సెల్ఫీ కోరగా, నిక్ జొనాస్ ఓ జంటిల్ మన్ లా పక్కకెళ్లి నిలబడ్డాడు. ఆ యువతిని ఆప్యాయంగా పలకరించిన ప్రియాంక, ఆమెతో సెల్ఫీ దిగేంత వరకూ వేచి చూశాడు. మరో అభిమాని ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

@priyankachopra and @nickjonas with a fan after their date night.

Wed, Jul 04, 2018, 10:22 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View