వరమాల వేయించేందుకు వధువును పైకి ఎత్తిన బంధువు... ఆపై లెంపకాయ కొట్టిన వధువు... వైరల్ అవుతున్న వీడియో!
Advertisement
ఎవరైనా చెంప దెబ్బకొడితే, ఎంత అవమానంగా ఉంటుంది? అది కూడా ఓ పెళ్లి మండపంలో నలుగురి ముందూ వధువు కొడితే... అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా? ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డ వేళ, వరుడిని అతని బంధువు ఒకరు పైకి ఎత్తి నిలబడ్డాడు. వధువు బంధువులు ఎవరైనా ఆమెను అంతకన్నా పైకి లేపి వరమాల వేయించడం సంప్రదాయం. అక్కడా అదే జరిగింది. వధువును పైకి ఎత్తి వరమాల వేయించిన బంధువును, కిందకు దించగానే లాగి పెట్టి ఒక్కటిచ్చిందా అమ్మాయి. ఆపై అతన్ని తిట్టింది కూడా. ఇక అవమానంతో కుంగిపోయిన ఆయన, పక్కనే ఉన్న మరో యువతిని లాగి కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను మీరూ చూడండి.
Tue, Jul 03, 2018, 12:06 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View