ఇక పెళ్లి చేసుకోవాలని ట్విట్టర్ లో కొడుక్కు సలహా ఇచ్చిన రిషి కపూర్!
Advertisement
బాలీవుడ్ సెలబ్రిటీ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ, కలసి తిరుగుతూ కనిపిస్తుండగా, వీరి పెళ్లి మరో రెండేళ్ల తరువాత జరుగుతుందని వార్తలు వస్తున్న వేళ, రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ తన ట్విట్టర్ లో ఓ చమత్కారాన్ని వదిలారు.

రణ్ బీర్, అతని మిత్రుడు కలసి దిగిన ఫొటోను పోస్టు చేసిన రిషి, "మంచి మిత్రులు. మీరిద్దరూ పెళ్లిచేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదే సరైన సమయం" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, రణ్ బీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సంజు' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజునే రూ. 34.75 కోట్లను సాధించిన చిత్రం, ఈ సంవత్సరం అత్యధిక తొలిరోజు వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది.
Sun, Jul 01, 2018, 11:53 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View