సీఎం రమేష్ చేత దీక్షను విరమింపజేసిన చంద్రబాబు
30-06-2018 Sat 14:34
- రమేష్, బీటెక్ రవిలకు నిమ్మరసం ఇచ్చిన చంద్రబాబు
- మీ దీక్షలు చరిత్రలో నిలిచిపోతాయన్న సీఎం
- ప్లాంట్ ను సాధించేంత వరకు పోరాటం కొనసాగిద్దామంటూ పిలుపు

కడప ఉక్కు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి రమేష్, బీటెక్ రవిల దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఇద్దరికీ శాలువా కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మీ దీక్షలు వృథాగా పోవని... కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని... అందరం సంఘటితమై, ప్లాంట్ ను సాధించేంత వరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు.
More Latest News
రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై షర్మిల విమర్శలు
3 hours ago

తెలంగాణలో 500కి దిగువన కరోనా కొత్త కేసులు
3 hours ago

రద్దీ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి
5 hours ago

వాళ్ల ఫస్టు మూవీ నాతోనే చేశారు: నితిన్
6 hours ago

సుధీర్ బాబు సినిమా అప్ డేట్
7 hours ago
