టోపీ పెట్టబోయిన ముస్లిం మత పెద్ద.. తిరస్కరించిన యూపీ సీఎం యోగి.. వీడియో వైరల్
Advertisement
మసీదు వ్యవహారాలు చూసుకునే ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తమ సంప్రదాయం ప్రకారం టోపీ పెట్టబోగా, దాన్ని యోగి తిరస్కరించారు. సీఎం తీరుపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సంత్‌ కబీర్‌ దాస్‌ 500వ వర్థంతిని పురస్కరించుకుని మఘర్ లో జరుగుతోన్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఆయన సమాధికి యోగి నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యోగికీ టోపీ పెట్టబోయిన ఆ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ... తాను సంప్రదాయం ప్రకారం టోపీ ఇవ్వబోయానని, కానీ యోగి మర్యాదపూర్వకంగా తిరస్కరించారని చెప్పారు.                                                                             
Thu, Jun 28, 2018, 08:19 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View