కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకొచ్చిన ఐడియా
Advertisement
ప్రముఖ టెలికాం కంపెనీ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ఆఫర్‌ ప్రకటించింది. రూ.227తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీలో అన్‌లిమిటెడ్‌ కాల్స్ తో పాటు అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డయలర్ టోన్లు, రోజుకు 1.4 జీబీ 3జీ లేక 2జీ డేటా, 100 ఎస్‌ఎంస్‌లను అందుకోవచ్చు. 28 రోజుల్లో మొత్తం 39.4 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లానులో ఉచితంగా మిస్డ్ కాల్ అలర్ట్‌లను కూడా అందుకోవచ్చు.

మరోవైపు అన్‌లిమిటెడ్‌ ధమాకా ఆఫర్‌ పేరుతో రూ.199 రీచార్జ్‌ ప్లాన్లతో కలిపి ఎంపిక చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ వంటి ఆఫర్లను కూడా అందిస్తోంది. టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో ఇస్తోన్న పోటీకి దీటుగా ఇతర కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.          
Wed, Jun 27, 2018, 06:14 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View