కుమార్తె ప్రియుడిపై స్పందించిన ప్రియాంకా చోప్రా తల్లి!
Advertisement
సెలబ్రిటీ కపుల్, గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమాయణంలో ఉన్న ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ లు ఇప్పుడు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న వేళ, వారి వివాహం కుదిరినట్టేనని వార్తలు వస్తుండగా, ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం భిన్నంగా స్పందించింది.

ముంబై అప్‌ స్కేల్ రెస్టారెంట్‌ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రియాంకా తల్లి మధు చోప్రా నిక్ జొనాస్‌ ను కలిసిందట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆమె, ఓ విందు కార్యక్రమానికి తాను, ప్రియాంక వెళితే, అక్కడ నిక్ ఉన్నాడని చెప్పింది. ఓ వ్యక్తిపై తక్కువ సమయంలోనే ఓ అభిప్రాయానికి రావడం కష్టమని, తాను ఇంతవరకూ నిక్ తో మాట్లాడలేదని, ఆ సమయమే తనకింకా దొరకలేదని చెప్పింది.
Tue, Jun 26, 2018, 08:57 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View