ఐశ్వర్యా రాయ్ కుమార్తెకు భావి భారత ప్రధాని చాన్స్... పలు ఆసక్తికర విషయాలు చెప్పిన జ్యోతిష్యుడు!
Advertisement
బాలీవుడ్ బిగ్ బీ మనవరాలు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ల గారాల పట్టి ఆరాధ్య భావి భారత ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయట. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ ఈ విషయాన్ని చెప్పారు. ఆమె జాతకంలో మంచి రాజకీయ యోగం ఉందని అభిప్రాయపడ్డ ఆయన, ప్రధాని కావాలని ఆమె భావిస్తే, ఆరాధ్య అన్న పేరుకు బదులుగా రోహిణి అని పేరు మార్చుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుతుందని తెలిపారు.

చిరంజీవి, రజనీకాంత్ లు రాజకీయాల్లోకి వస్తారని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, 2024లో ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుందని జోస్యం చెప్పారు. వచ్చే సంవత్సరం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ వివాహం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.
Mon, Jun 25, 2018, 11:26 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View