ఇండియాలో దిగిన రెండో రోజే ప్రియుడితో డిన్నర్ డేట్... తళుక్కుమన్న ప్రియాంకా చోప్రా!
Advertisement
తన ప్రియుడు నిక్ జాన్సన్ తో ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, ఆ మరుసటి రోజే అతనితో కలసి డిన్నర్ డేట్ కు వచ్చింది. శనివారం రాత్రి నారా థాయ్ ప్రాంతంలోని బీకేసీ రెస్టారెంట్ కు ఈ జంట వచ్చింది. ఇద్దరూ కలసి ముంబైలోనే కొంతకాలం ఉంటారని తెలుస్తుండగా, ప్రియాంక ఈ డిన్నర్ డేట్ కు వేసుకు వచ్చిన డ్రస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బ్లాక్ అండ్ వైట్ గిన్ గామ్ ను ధరించి వచ్చిన ఆమె, మ్యాచింగ్ స్కర్టుతో తళుక్కున మెరిసింది. ప్రియాంకను నిక్ చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఆమె ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్యా గత కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. 
Sun, Jun 24, 2018, 11:16 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View