పతంజలి మెసేజింగ్‌ యాప్‌ 'కింభో' వచ్చేస్తోంది: బాబా రామ్‌దేవ్‌ ప్రకటన
Advertisement
భారత్‌లో వాట్సప్‌కు పోటీ అంటూ వచ్చిన మెసేజింగ్‌ యాప్‌ కింభో మళ్లీ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మాయమైపోయిన విషయం తెలిసిందే. ఆ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలుండడంతో వాటిని తొలగించాక మళ్లీ విడుదల చేస్తామని పతంజలి ప్రకటన కూడా చేసింది. కాగా, ఈ యాప్‌ అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది.

మరో రెండు నెలల్లో ‘స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌’ను అధికారికంగా విడుదల చేస్తామని యోగా గురు బాబా రామ్ దేవ్‌ తాజాగా ప్రకటన చేశారు. తమ యాప్‌ టెస్టింగ్‌ దశలోనే భారీగా ట్రాఫిక్‌ను ఎదుర్కొందని, యూజర్‌ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో పరిశీలిస్తున్నామని చెప్పారు. 'ఇప్పుడు భారత్‌ మాట్లాడుతుంది' అనే నినాదంతో ఈ యాప్‌ వస్తోంది.        
Sat, Jun 23, 2018, 04:45 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View