రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఛాన్స్ కొట్టేసిన సురభి

23-06-2018 Sat 14:22

తెలుగు తెరని పలకరించిన అందమైన కథానాయికలలో సురభి ఒకరు. సురభి చేసింది తక్కువ సినిమాలే అయినా .. వాటిలో విజయాన్ని సాధించినవే ఎక్కువ. సక్సెస్ రేటుతో పాటు యూత్ లో ఈ సుందరికి మంచి క్రేజ్ కూడా వుంది. అయినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయి అవకాశాలను అందుకోలేకపోతోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

తాజాగా సురభి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్లో చేయడానికి అంగీకరించింది. శ్రీనివాస నాయుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆమె ఆది సాయికుమార్ కు జోడీగా కనిపించనుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఆది సాయికుమార్ సతమతమైపోతున్నాడు. సురభి కూడా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఇద్దరి ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.       


ADVERTSIEMENT

More Telugu News
India slips in tourism development and international travel index
Telangana sees little raise in corona positive cases
Buttler steers Rajasthan Royals to set huge target to Gujarat Titans
Chandrababu condemns home minister comments on TDP
Dead lizard spotted in Cool Drink at a McDonalds outlet in Ahmedabad
Sajjala says all parties gave consent on name change of Konaseema district
Minister Pinipe Viswaroop responds to rioters set fire his house in Amalapuram
Pawan Kalyan condemns home minister allegations on Janasena
Taneti Vanitha alleges TDP and Janasena behind riots in Amalapuram
Agitations raised in Konaseema as protesters set fire Minister and MLA home
Gujarat Titans won the toss in Qualifier one of IPL Play Offs
F3 movie update
PM Narendra Modi will visit Hyderabad on May 26th
F3 movie update
BJP criticizes Rahul Gandhi who was seen photographed with Brit MP Jeremy Corbyn
..more