అది నా వ్యక్తిగత విషయం: పెళ్లి గురించి హీరో ప్రభాస్‌
Advertisement
'బాహుబలి' సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న ఆయనకు ఎదురవుతుంది. తాజాగా ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా మళ్లీ ఇదే ప్రశ్న అడిగారు. దీంతో ప్రభాస్‌ స్పందిస్తూ... అది తన వ్యక్తిగత విషయమని, దాని గురించి చెప్పడం తనకు ఇష్టంలేదని, చెప్పాలనుకోవడం లేదని అన్నాడు. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతానని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రభాస్ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తోన్న ‘సాహో’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Mon, Jun 18, 2018, 07:42 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View