జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలకు ఉద్యోగాలిస్తా: బాబా రాందేవ్
18-06-2018 Mon 14:19
- తీహార్ జైల్లో యోగా శిక్షణ ఇచ్చిన బాబా
- వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ
- పగ, ప్రతీకారాలకు దూరంగా ఉండాలంటూ హితవు

తీహార్ జైల్లో శిక్షను పూర్తి చేసుకుని, విడుదలయ్యే వెయ్యి మంది ఖైదీలకు ఉద్యోగాలను ఇస్తానని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న 11 వేల మంది ఖైదీలకు రాందేవ్ బాబా యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖైదీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జైల్లో ఉన్న వెయ్యి మంది ఖైదీలను యోగా శిక్షకులుగా మార్చి, వారు విడుదల కాగానే ఉద్యోగాలను ఇస్తానని తెలిపారు. తీహార్ జైల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులను టీజే బ్రాండ్ పేరుతో విక్రయించేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. పగ, ప్రతీకారాలకు అందరూ దూరంగా ఉండాలని హితవు పలికారు. ధూమపానాన్ని వదిలేయాలని సూచించారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
8 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
8 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
8 hours ago
