స్మార్ట్ ఫోన్ ను టీవీ రిమోట్ గా మార్చుకోండిలా!
Advertisement
Advertisement
మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా? దాని రిమోట్ ఎక్కడో పెట్టి మరచిపోతుంటారా? పక్కనే మీ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ టీవీని స్మార్ట్ ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. అంతే కాదు, టీవీతో పాటు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్, ఫైర్ టీవీ స్టిక్ గానూ స్మార్ట్ ఫోన్ ను వాడుకోవచ్చు. అది ఎలాగంటే...

మీ స్మార్ట్ టీవీకి వైర్ లెస్ కనెక్టివిటీ ఉండాలి. ఒకే వైఫై నెట్ వర్క్ పై స్మార్ట్ ఫోన్, టీవీ పని చేస్తుండాలి. స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కనీసం ఆండ్రాయిడ్ 4.4 దానికి పైన ఉండాలి. స్మార్ట్ టీవీ లేదా బాక్స్ ఏపీకే ఫైల్స్ ను సపోర్ట్ చేయాలి.

ఇక సెటప్ ఎలాగంటే...
'సెటజ్ ప్లే' (CetusPlay) పేరిట ఆండ్రాయిడ్, ఐఓఎస్, టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కు అందుబాటులో ఉన్న యాప్ ను స్మార్ట్ ఫోన్, టీవీల్లో డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్పుడు స్మార్ట్ ఫోన్ లో యాప్ ను ఓపెన్ చేస్తే, స్మార్ట్ టీవీ డివైస్ కనిపిస్తుంది. టీవీ, స్మార్ట్ ఫోన్ యాప్స్ అడిగిన పర్మిషన్స్ ఇచ్చిన తరువాత, రెండూ అనుసంధానం అవుతాయి. రిమోట్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించుకోవచ్చు. డీప్యాడ్ లేదా టచ్ ప్యాడ్ లేదా మౌస్ మోడ్, గేమ్ ప్యాడ్ మోడ్ ఇలా ఎలా కావాలంటే అలా రిమోట్ ను వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సాయంతో టీవీలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.  
Sun, Jun 17, 2018, 10:41 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View