అతి తక్కువ ధరకే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన టిక్కెట్‌!
Advertisement
ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పలు మార్గాల్లో అతి తక్కువ ధరకే టిక్కెట్లు అందిస్తోంది. ఉడాన్‌ పథకం కింద ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఈ టిక్కెట్లు లభ్యమవుతాయి. ఆర్‌సీఎస్‌ మార్గాల్లో తమ నెట్‌వర్క్‌పై పలు ఇతర మార్గాలతో అలహాబాద్‌ను కనెక్ట్‌ చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

అలహాబాద్‌ నుంచి ముంబయికి టూ-వే కనెక్షన్లలో నాగ్‌పూర్‌, ఇండోర్‌, లక్నో మార్గాల మీదుగా వెళ్లే విమానాల టిక్కెట్లను, అలాగే, ఇండోర్, పాట్నా మీదుగా అలహాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే విమాన టిక్కెట్లను రూ.1,177కే అందించనున్నట్టు పేర్కొంది. ఇండోర్‌ మీదుగా అలహాబాద్‌ నుంచి పూణెను కనెక్ట్‌ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు లక్నో మీదుగా అలహాబాద్‌ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పూణె, జైపూర్‌లకు కనెక్ట్‌ చేస్తోంది.              
Fri, Jun 15, 2018, 04:26 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View