నాలుగో అంతస్తు నుంచి.. కారుతో పాటు వేలాడుతూ కనపడిన వృద్ధురాలు
Advertisement
నాలుగో అంతస్తులో కార్‌ పార్కింగ్‌ చేయడానికి ప్రయత్నించిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి ఆ వాహనంతో సహా కింద పడిపోబోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలోని శాంటామోనికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె కారు బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌ తొక్కడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరించారు.

ఆ వృద్ధురాలు అమెరికాలోని పర్యాటక ప్రాంతాలు చూడడానికి ఫ్రాన్స్‌ నుంచి వచ్చిందని తెలిపారు. కార్‌ పార్కింగ్‌ సమయంలో బ్రేక్‌ బదులు యాక్సిలరేటర్‌ తొక్కడంతో అది ఒక్కసారిగా వేగంగా ముందుకు వెళ్లి తీగలను ఢీకొట్టిందని, దీంతో ఆమె కారుతో పాటు నాలుగో అంతస్తు నుంచి వేలాడుతూ కనిపించిందని తెలిపారు. ఆమెను సురక్షితంగా కిందకు దింపామని వివరించారు. ఈ ఘటనలో ఆమెకు అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలూ కాలేదు.                 
Wed, Jun 13, 2018, 08:52 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View