భార్యపై తనకున్న కేరింగ్ ను చూపిన విరాట్... వైరల్ అవుతున్న ఫొటోలు!
Advertisement
ఇండియాలోని మోస్ట్ పాప్యులర్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒక జంటగా గుర్తింపున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు సంబంధించిన తాజా ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన ఈ జంట ఎయిర్ పోర్టులో మీడియా కంట కనిపించింది. తన సతీమణి అనుష్క చేతిని వదలని విరాట్, ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకు వచ్చాడు. స్వయంగా డోర్ తీసి కారు ఎక్కించాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, ఎంతైనా విరాట్ కోహ్లీకి అనుష్క అంటే ఎంతో ప్రేమని వ్యాఖ్యానిస్తున్నారు. తన కేరింగ్ ను ఇలా చూపిస్తున్నాడని కితాబునిస్తున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.
Wed, Jun 13, 2018, 12:45 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View