నటిని ముద్దాడేందుకు షారూక్, గుల్షన్ గ్రోవర్ పోటీ పడుతున్న పాత ఫొటో వైరల్... ఆమె ఎవరా అని తెగ ఆరా తీస్తున్న నెటిజన్లు!
Advertisement
నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న ఫొటో ఇది. పాత ఫొటోనే అయినా, దీనిలో షారూక్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ లు ఓ నటిని ముద్దాడేందుకు ఒకేసారి పోటీ పడుతున్నారు. ఇక వీరిద్దరి మధ్యలో ఉన్నది ఎవరా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటో వెనకున్న వాస్తవం ఏంటంటే...
ఇది 1995లో వచ్చిన 'బాజీ' చిత్రంలోనిది. చిత్రంలో ఉన్న నటి ఎవరో కాదు... అమీర్ ఖాన్. అశుతోష్ గోవారికర్ తీసిన ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో అమీర్ ఖాన్ ఇలా అమ్మాయి వేషం వేసుకున్నాడు. ఓ కేసు పరిష్కారం నిమిత్తం అండర్ కవర్ ఆపరేషన్ సాగించే అమీర్, ఇలా అమ్మాయి వేషం వేసుకున్నాడు. చిత్రంలో ఆ సమయంలో 'డోలే డోలే' అంటూ సాగే పాట కూడా వస్తుంది.
Wed, Jun 13, 2018, 09:35 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View