కిటికీలోంచి వేలాడుతోన్న చిన్నారిని కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
Advertisement
ఓ యువకుడు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి చిన్నారిని కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ చైనా మీడియా ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సౌత్ చైనాలోని జిజియాంగ్‌లోని ఓ పెద్ద అపార్ట్‌మెంటులో తాము ఉంటోన్న ఫ్లాట్‌ కిటికీలోంచి ఓ పిల్లాడు ఒక్కసారిగా జారిపోయి, ఆ కిటికీకే వేలాడుతూ కనపడ్డాడు.

ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి వెంటనే చక చకా ఆ అపార్ట్‌మెంట్‌ ఎక్కి ఆ పిల్లాడిని కాపాడాడు. చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. స్పైడర్‌ మ్యాన్‌లా ఆ అపార్ట్‌మెంటును చాలా తొందరగా ఎక్కాడని కామెంట్లు చేస్తున్నారు. మీరూ చూడండి...
Mon, Jun 11, 2018, 05:53 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View