ఈ యాప్‌లతో బీకేర్‌ఫుల్.. హెచ్చరిస్తున్న పరిశోధకులు
Advertisement
గూగుల్ ప్లే స్టోర్ నుంచో, యాపిల్ స్టోర్ నుంచో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారు ముందుగా రేటింగ్‌లను చూస్తారు. రేటింగ్ బాగుంటే యాప్ పనితీరు బాగుందని ఓ అంచనాకు వస్తారు. అయితే, రేటింగులు, రివ్యూలపై ఆధారపడడం మంచిది కాదని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా వైద్య రంగ యాప్‌లపై మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ ద్వారా రక్తపోటును చూసుకోవచ్చంటూ గతంలో వచ్చిన ఓ యాప్ తర్వాత సోదిలో లేకుండా పోయింది. ఈ యాప్‌కు వచ్చిన రేటింగులు, రివ్యూలను అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు విశ్లేషించారు. రేటింగ్ ఇచ్చిన వారిలో 59 శాతం మంది అద్భుతమైన యాప్ అని పేర్కొన్నారు. అయితే, తర్వాతి కాలంలో ఆ యాప్ నాణ్యమైన ఫలితాలను ఇవ్వలేదని తేలింది. కాబట్టి వైద్యపరమైన అవసరాల కోసం రేటింగులపై ఆధారపడి యాప్‌లను ఎంచుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.
Mon, Jun 11, 2018, 09:02 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View