పార్లమెంటులో ఒలికిన కాఫీ.. స్వయంగా క్లీన్ చేసిన డచ్ ప్రధాని!.. నేర్చుకోండయ్యా.. అంటున్న నెటిజన్లు
Advertisement
పార్లమెంటులో కాఫీ తాగుతుండగా పొరపాటున కింద ఒలికిన కాఫీని డచ్ ప్రధాని స్వయంగా క్లీన్ చేశారు. ఇప్పుడీ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవడమే కాదు.. ఇక భారత్‌లోని రాజకీయ నాయకులు కూడా ఈ పనికి క్యూ కడతారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

డచ్ పార్లమెంటులో కాఫీ తాగుతుండగా ప్రధాని మార్క్ రుట్ చేతిలోని కాఫీ పొరపాటున కింద ఒలికింది. మరొకరు అయితే, సిబ్బందిని పిలిచి శుభ్రం చేయమని ఆదేశిస్తారు. కానీ రుట్ అలా చేయలేదు. నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే తుడుపుకర్రను తీసుకొచ్చి స్వయంగా క్లీన్ చేశారు. ఇది చూసిన సిబ్బంది కరతాళ ధ్వనులతో ప్రధానిని అభినందించారు. దౌత్యవేత్త సీస్ వాన్ బీక్ ఈ వీడియోను తొలుత ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. అంతే.. ప్రపంచవ్యాప్తంగా అది పాకిపోయింది. లక్షలాది షేర్లు, లైకులు, రీట్వీట్లతో దూసుకుపోయింది.

ఈ వీడియోను చూసిన భారతీయ నెటిజన్లు.. డచ్ ప్రధానిని చూసి మనవాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే.. ఇక మనవాళ్లు కూడా క్యూకడతారని సెటైర్ వేశారు. అసలు సిసలైన నాయకత్వానికి ఇది చక్కని ఉదాహరణ అని మరికొందరు అభివర్ణించారు.
Wed, Jun 06, 2018, 09:01 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View