ఎంత మంచోడో మా ఆయన... నా కోసం పూలు తెస్తున్నాడు!: ఉపాసన

05-06-2018 Tue 11:03
advertisement

తన కోసం ఓ ఫ్లారిస్ట్ వద్ద షాపింగ్ చేసి వస్తున్న హీరో రామ్ చరణ్ ఫొటోను షేర్ చేసుకున్న ఉపాసన, తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. మిస్టర్ సీ తన కోసం పూల బొకేను కొన్నారని చెబుతూ మురిసిపోయారు. ఈ చిత్రంలో చరణ్ కారులో ఎంతో జాగ్రత్తగా ఓ బొకేను పొదివి పట్టుకుని కూర్చున్నట్టు కనిపిస్తుండగా, ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు, భార్య పట్ల రామ్ చరణ్ కు ఉన్న ప్రేమకు ఈ ఫొటో నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ ఎంతో అమాయకంగా, క్యూట్ గా కనిపిస్తున్నారని, స్వచ్ఛమైన ప్రకృతికి సాక్ష్యంగా నిలిచే పూలు ఆయన చేతిలో క్షేమంగా ఉన్నాయని అంటున్నారు. ఈ పిక్ చూస్తుంటే అన్నయ్యకు ఉపాసనంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement