వేలాదిమంది ముందు అధర చుంబనం.. విమర్శలపాలైన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
Advertisement
73 ఏళ్ల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యటెర్టె తన చేష్టలతో మరోమారు విమర్శల పాలయ్యారు. వేలాదిమంది ఎదుట ఓ వివాహితతో స్టేజిపైనే పెదాలపై ముద్దు పెట్టించుకున్నారు. ఆయన చర్యతో అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలను డ్యుటెర్టె కొట్టి పడేశారు. మద్దతుదారులను ఉత్సాహపరచడానికే అలా చేసినట్టు చెప్పుకొచ్చారు.

దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించిన ఆయన తన మద్దతుదారులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతను స్టేజిపైకి పిలిచిన ఆయన ఓ మహిళ చేతిలో పుస్తకం పెట్టారు. అనంతరం తన పెదవులపై ముద్దు పెట్టాల్సిందిగా పలుమార్లు కోరారు. దీంతో తొలుత షాక్ తిన్న మహిళ, తర్వాత నవ్వాపుకోలేకపోయారు. పడీపడీ నవ్వారు. అయినప్పటికీ అధ్యక్షుడు వదిలిపెట్టలేదు. పెదవులపై ముద్దు పెట్టాలని వేలిని పెదవులపై ఉంచి పలుమార్లు కోరారు. దీంతో మరోమార్గం లేని ఆమె ముద్దు పెట్టి అధ్యక్షుడి కోరిక తీర్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీ చానెల్ లైవ్ ప్రసారం చేయడంతో అధ్యక్షుడి కిస్ వైరల్ అయింది.
Tue, Jun 05, 2018, 07:58 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View