ఆటోపై కారును తీసుకెళ్లిన వైనం... వీడియో వైరల్
Advertisement
మూడు చక్రాల వాహనంపై నాలుగు చక్రాల వాహనాన్ని మోసుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియోను ఓ చైనా మీడియా తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ దేశంలోని జెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాడవడంతో దాని పార్టులను అమ్మేయాలని భావించాడు.

దీంతో దానిని ఓ చోటి నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఓ ఆటోను మాట్లాడుకుని దానిపై ఉంచి తీసుకెళ్లాడు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్‌కు 1300 యువాన్ల (దాదాపు 13,500) ఫైన్‌ వేశారు. ఆటోపై కారును తీసుకెళ్లిన వైనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.                       
Mon, Jun 04, 2018, 07:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View