పొట్ట పెరిగితే హృద్రోగ సమస్యలు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
Advertisement
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చాలా మందికి పొట్ట వచ్చేస్తోంది. లావుగా ఉన్న వారికే కాకుండా సన్నగా ఉన్న వారికి కూడా చాలా మందికి పొట్ట వస్తోంది. అయితే, సన్నగా ఉండేవారికి పొట్ట ఉంటే వారికి హృద్రోగాలు వచ్చే అవకాశం అధికమని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.

 45 ఏళ్లు దాటిన 1500 మందిని సదరు శాస్త్రవేత్తలు 16 సంవత్సరాలపాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. పొట్ట అధికంగా ఉన్నవారు వ్యాయామం చేయాలని, పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించాలని తెలిపారు.                                                                                                                           
Sun, Jun 03, 2018, 06:20 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View