'ఈ జీవితానికి ఇలాంటి వాడు ఉంటే చాలు'... పాక్ యువకుడి అందానికి ఫిదా అవుతున్న అమ్మాయిలు!
Advertisement
పాకిస్థాన్ కు చెందిన అర్షద్ ఖాన్ గుర్తున్నాడా? ఓ టీస్టాల్ లో పని చేస్తున్న అర్షద్ ఫొటో రాత్రికి రాత్రే వైరల్ కాగా, ఇప్పుడు అతను పెద్ద మోడల్ అయ్యాడు. మ్యూజిక్ ఆల్బం చేసి సక్సెస్ ను రుచి చూశాడు కూడా. ఇప్పుడు పాక్ నుంచి మరో యువకుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

ఓ పుచ్చకాయను కోస్తున్న యువకుడి చిత్రాన్ని అతని ఫ్రెండ్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ఓ యువతి "కర్బూజా వాలా పఠాన్ వంటి యువకుడు కావాలి... ఈ జీవితానికి అంతే చాలు" అని కామెంట్ చేసింది. చాయ్ వాలాకన్నా ఇతను మరింత స్మార్ట్ గా ఉన్నాడని పాక్ అమ్మాయిలు ఫిదా అవుతున్నారు.

ఇక ఇతని గురించిన వివరాలు కూడా వెంటనే తెలిసిపోయాయి. ఇతనేమీ కర్బూజావాలా కాదట. ఈ యువకుడి పేరు మహ్మద్ ఓవేజ్ అని, కరాచీలోని జియావుద్దీన్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడని, కాబోయే డాక్టరని అతని మిత్రుడు మహ్మద్ ఇన్షాల్ తెలిపాడు. ఇక ఇంత అందమైన యువకుడు కాబోయే డాక్టరని తెలుసుకున్న పాక్ అమ్మాయిలు మరింతగా ఫిదా అవుతున్నారట.
Sun, Jun 03, 2018, 09:48 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View