30 ఏళ్ల నాటి పాటకు డ్యాన్స్ అదరగొట్టిన అంకుల్... ఎక్కడ చూసినా ఈ వీడియోనే!
Advertisement
సామాజిక మాధ్యమాలు రంగ ప్రవేశం చేసిన తరువాత, ఏ చిన్న ఫొటో, లేదా వీడియో ఎవరికైనా నచ్చితే, ఎంతగా వైరల్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి మలయాళ నటి ప్రియ ఒక్కసారి కన్నుగీటగా, ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అంతగాకాకున్నా, గత రెండు రోజులుగా ఫేస్ బుక్, వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ అంకుల్ సందడి చేస్తున్నాడు.

దాదాపు 40 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి, 1987లో జితేంద్ర, గోవింద, శతృఘ్నసిన్హా కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ 'ఖుద్ గర్జ్'లోని 'ఆప్ కే ఆజానే సే' అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. పక్కన ఉన్న ఓ ఆంటీ ఆయన్ను అనుసరించలేక అలా చూస్తుండిపోయింది. పలువురు సెలబ్రిటీల నుంచి ఎంతో మంది సామాన్యుల వరకూ షేర్ చేసుకుంటున్న ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది ఎవరు? ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలు తెలియకపోయినా, ఇది తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓమారు చూడండి.
Fri, Jun 01, 2018, 08:55 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View