పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు!
01-06-2018 Fri 08:39
- ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డును దాటిన 'పెట్రో' ధరలు
- రాయితీతో కూడిన సిలిండర్ ధర పెంపు
- రూ. 2.34 మేరకు పెంచుతున్నట్టు ఓఎంసీల ప్రకటన

కర్ణాటక ఎన్నికల తరువాత రోజూ పెట్రోలు, డీజెల్ ధరలను పెంచుతూ, వాటిని ఆల్ టైమ్ రికార్డును దాటించిన చమురు కంపెనీలు, ఇప్పుడు వంట గ్యాస్ పై పడ్డాయి. రాయితీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 2.34 మేరకు పెంచుతున్నట్టు ఓఎంసీలు ప్రకటించాయి. కాగా, ధరలు పెరిగిన తరువాత ఢిల్లీలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 493.55కు చేరగా, కోల్ కతాలో రూ. 496.65కు, ముంబైలో రూ. 491.31, చెన్నైలో రూ. 481.84గా ఉంది. ప్రస్తుతానికి పెరిగిన ధరలు మెట్రో నగరాల్లో మాత్రమే అమలవుతాయని, మిగతా ప్రాంతాల్లో ఈ కొత్త ధర ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చమురు కంపెనీల ప్రతినిధి ఒకరు తెలిపారు.
More Latest News
హర్ ఘర్ తిరంగా ఎఫెక్ట్.. 10 రోజుల్లో ఎన్ని జాతీయ జెండాలు అమ్ముడుపోయాయో తెలిస్తే షాకవుతారు
4 minutes ago

'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!
13 minutes ago

మునుగోడు టీఆర్ఎస్లో ముసలం... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల తీర్మానం
27 minutes ago

విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ
47 minutes ago

ఈ సైకిల్ కు ముందు చక్రం ఉందా? లేదా?.. దృష్టి భ్రాంతితో గందరగోళం.. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫొటో!
54 minutes ago

మహిళ అవస్థ చూసి.. పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో
1 hour ago
