అంత సీను లేదు... కేఎల్ రాహుల్ తో డేటింగ్ పై హీరోయిన్ నిధి అగర్వాల్
Advertisement
క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్ తో తాను డేటింగ్ లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. వీరిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుండగా, తనకు కేఎల్ రాహుల్ చాలా కాలం నుంచి తెలుసునని, అతనితో కలసి డిన్నర్ కు మాత్రమే వెళ్లానని, తామిద్దరం డేటింగ్ లో ఉన్నామని వచ్చిన వార్తలు పుకార్లేనని తేల్చేసింది. కేఎల్ రాహుల్ క్రికెటర్ కాకముందు, తాను నటిని కాకముందు నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, తామిద్దరమూ బెంగళూరులో కలసి చదువుకున్నామని వెల్లడించింది. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని నిధి అగర్వాల్ వెల్లడించగా, ఈ విషయంలో రాహుల్ ఇంకా స్పందించలేదు.  
Fri, Jun 01, 2018, 08:19 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View