బస్సు నడుపుతూ పెళ్లి మండపానికి వెళ్లిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
Advertisement
తన పెళ్లి జరగనున్న ఫంక్షన్‌ హాల్‌కి తమ బంధువులను తీసుకెళ్లేందుకు ఓ పెళ్లి కూతురు బస్సు నడిపిన ఘటనకు సంబంధించిన వీడియో అలరిస్తోంది. బస్సు నడుపుతూ మధ్యలో పెళ్లి కొడుకు ఇంటి వైపునకు వెళ్లి ఆయనను కూడా అందులో ఎక్కించుకుని, తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ యువతి వెళ్లింది. ఇందుకు సబంధించిన వీడియోను ఓ చైనా మీడియా తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆ పెళ్లి కూతురికి సొంతంగా ఓ బస్సు ఉందని, ఆమే దానికి డ్రైవర్‌ అని తెలిపింది. తన పెళ్లి సందర్భంగా బస్సు అంతా బెలూన్లు, పూలతో అలంకరించింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించాలని, పచ్చదనాన్ని పెంచాలని అందరూ అనుకుంటున్నారని, అందుకే తాను పెళ్లి వేడుకకు కారులో కాకుండా తనకు కేటాయించిన బస్సులోనే వెళ్లానని చెప్పింది. ఈ బస్సులు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని తెలిపింది.    
Wed, May 30, 2018, 02:49 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View