పూర్తిస్థాయిలో 'వాట్సాప్‌ పేమెంట్‌' సేవలు ప్రారంభం.. మూడు బ్యాంకులతో ఒప్పందం!
Advertisement
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇండియాలోని తన వినియోగదారులందరికి వచ్చేవారంలో పేమెంట్‌ సేవలను అందివ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. లావాదేవీల ప్రక్రియ కోసం ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లతో 'వాట్సాప్' ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఎస్‌బీఐ కూడా ఈ జాబితాలోకి చేరబోతోంది. మొదటి దశలో కొంత మంది వినియోగదారులతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పేమెంట్‌ సేవలు విజయవంతం కావడంతో ఇపుడు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా భారత్ లో 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు.
Wed, May 30, 2018, 02:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View