ట్రెడ్ మిల్ పై ఇలా డ్యాన్స్ చేయొచ్చా... ఇంటర్నెట్ ను ఊపేస్తున్న వీడియో!
Advertisement
ఓ క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉండే ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేయడమంటేనే కాస్తంత క్లిష్టం. అలవాటు లేక ట్రెడ్ మిల్ పై నుంచి పడి గాయాల పాలైన వారు ఎందరో ఉన్నారు. అటువంటిది ట్రెడ్ మిల్ పై డ్యాన్స్ అంటే... ఓ పంజాబీ సాంగ్ కు అనుగుణంగా ట్రెడ్ మిల్ పై లయబద్ధంగా డ్యాన్స్  చేస్తున్న యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనమైంది.

మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ వీడియోను చూసిన వారంతా, ఆ యువతి చేసిన కిల్లర్ మూమెంట్స్ కు 'వావ్' అనకుండా ఉండలేకపోతున్నారు. 'మేరా పంజాబ్' ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ యువతి ట్రెడ్ మిల్ పై డ్యాన్స్ చేసేలా పూర్తి శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. ఇటువంటి ప్రయోగాలు సాధారణ ప్రజలు చేస్తే ప్రమాదకరం. ట్రెడ్ మిల్ పై యువతి విన్యాసాల వీడియోను మీరూ చూడవచ్చు.
Wed, May 30, 2018, 12:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View