ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ గాంధీ వస్తామన్నారు: కుమారస్వామి
21-05-2018 Mon 20:07
- గాంధీ కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఢిల్లీకి వచ్చాను
- సోనియా, రాహుల్‌లను కలిశాను
- డిప్యూటీ సీఎం అంశంపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

గాంధీ కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే తాను ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలిశానని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఈ రోజు వారిని కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని వారిని కోరానని, అందుకు వారు అంగీకరించారని తెలిపారు.
కర్ణాటకలో మంత్రి వర్గ కూర్పుపై తమ పార్టీ తరఫున చర్చించేందుకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ కర్ణాటక జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కి అనుమతి ఇచ్చారని, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయనకు చెప్పారని కుమారస్వామి అన్నారు. డిప్యూటీ సీఎం అంశంపై రేపు వేణుగోపాల్ తమ పార్టీ నేతలతో తుది సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
7 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
