మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్!
Advertisement
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. చాలాకాలం నుంచి అందరూ ఎదురుచూస్తున్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఫేస్ బుక్ తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా అంతకుమించి సభ్యులు గ్రూప్ వీడియో కాల్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లలో 2.18.145 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు గ్రూప్ వీడియో కాల్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది. అలాగే ఐఓఎస్‌లో గ్రూప్ వీడియో కాల్‌ చేసుకోవాలంటే 2.18.52 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతానికి కొంతమంది వినియోగదారులకు మాత్రమే లభిస్తుండగా అతి త్వరలోనే ప్రతి వినియోగదారుడికి అందుబాటులోకి రానుంది.
Mon, May 21, 2018, 04:34 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View