మహేష్ బాబు వస్తున్నాడన్న వార్తతో.. అభిమానులతో నిండిపోయిన యాదగిరిగుట్ట!
29-04-2018 Sun 08:02
- స్వామిని దర్శించుకోనున్న మహేష్ బాబు బృందం
- భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు
- సినిమా హిట్ తరువాత దేవాలయాలు తిరుగుతున్న చిత్ర బృందం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించగా, ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'భరత్ అనే నేను' చిత్ర బృందం ఈ ఉదయం యాదగిరిగుట్టకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోనుంది. ఈ బృందంలో మహేష్ బాబు కూడా ఉండటంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకోవడంతో సందడి నెలకొంది.
ఓవైపు లక్ష్మీ నరసింహుని జయంతి ఉత్సవాలు గుట్టపై అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ, మహేష్ బాబుతో పాటు కొరటాల శివ, చిత్ర టీమ్ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మహేష్ బాబు రాకను పురస్కరించుకుని రద్దీ పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. కాగా, సినిమా విడుదల తరువాత మహేష్ బాబు తొలుత విజయవాడ కనకదుర్గమ్మను, ఆపై తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
More Latest News
సీఎం జగన్ పీఏ నంటూ కార్పొరేట్ ఆసుపత్రికి మెసేజ్ పంపి రూ. 10 లక్షల డిమాండ్: గుర్తు తెలియని వ్యక్తిపై కేసు
14 minutes ago

అప్పుడు కూలీ, ఆటో డ్రైవర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి
30 minutes ago

మీనా తన భర్తను కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించింది: కొరియోగ్రాఫర్ కళా మాస్టర్
43 minutes ago

కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాడంటే ఇక అతడిని ఆపడం ఎవరి తరం కాదు: పాక్ మాజీ సారథి మిస్బా
9 hours ago

లాగే గుర్రమేదో, తన్నే గుర్రమేదో గ్రహించండి... వైవీ సుబ్బారెడ్డికి వాసుపల్లి గణేశ్ వేడుకోలు
10 hours ago
